Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ సెకండ్ ట్రైల‌ర్ అదిరిందిగా..

ఇస్మార్ట్ శంక‌ర్ సెకండ్ ట్రైల‌ర్ అదిరిందిగా..

26
0
ఇస్మార్ట్ శంక‌ర్ సెకండ్ ట్రైల‌ర్ అదిరిందిగా.. spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వ‌ల్, న‌భా న‌టేష్ న‌టించారు. పూరి – ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఫ‌స్ట్ ట్రైల‌ర్ కు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ గుర్తించారు అనుకుంట‌.. తాజాగా సెకండ్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు.

రామ్ ఎన‌ర్జి, క్యారెక్ట‌ర్ .. తెలంగాణ యాస‌లో మాట్లాడ‌డం.. సాంగ్స్, రొమాన్స్.. ఇవ‌న్నీ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. సెకండ్ ట్రైల‌ర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మాస్ ఆడియ‌న్స్ కి పండ‌గే అనేంత‌గా ఇస్మార్ట్ శంక‌ర్ పై అంచ‌నాలు పెంచింది. రామ్ ఈ సినిమాని చూసి పూరిని ఆకాశానికి ఎత్తేసాడు.

దీంతో ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్ అంతా చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు. ఖ‌చ్చితంగా ఇస్మార్ట్ శంక‌ర్ పెద్ద విజ‌యం సాధిస్తాడు అంటున్నారు. ఈ నెల 18న ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మ‌రి.. ఇస్మార్ట్ శంక‌ర్ ఆశించిన విజ‌యాన్ని సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here