Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ సెన్సార్ పూర్తి. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

ఇస్మార్ట్ శంక‌ర్ సెన్సార్ పూర్తి. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

20
0
ఇస్మార్ట్ శంక‌ర్ సెన్సార్ పూర్తి. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..? spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న నిథి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ న‌టించారు. పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంక‌ర్ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

పూరి తెర‌కెక్కించిన పోకిరి, బిజినెస్ మేన్, దేశ‌ముదురు చిత్రాల‌కు సెన్సార్ బోర్డ్ ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాలు ఎంత‌టి విజ‌యాన్ని సాధించాయో తెలిసిందే. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ కు కూడా ఏ స‌ర్టిఫికెట్ రావ‌డంతో సెంటిమెంట్ ప్ర‌కారం సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించ‌డం ఖాయం అని పూరి టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నెల 18న ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మ‌రి.. సెన్సార్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందో..?  లేదో..? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here