Home Actor ఈ టైంలో నాకు కావాలనిపించిన కథ ఇది – ఆది సాయికుమార్

ఈ టైంలో నాకు కావాలనిపించిన కథ ఇది – ఆది సాయికుమార్

350
0

వైవిధ్య మైన కథా,కథనాలతో వస్తున్న యూత్ పుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడి’. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న హీరో ఆది,  యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రద్ధా శ్రీనాథ్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన‌ జోడి సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అయ్యింది.  ప్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన జోడి  అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది.  విడుదలైన టీజర్ ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకుల్లోనూ  ఆసక్తిని పెంచింది.  సినిమా బిజినెస్ కి కూడా మంచి ఆఫర్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. హీరో ఆది, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ లుక్స్ కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి.

రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరెకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ యూత్ కి బాగా రిలేట్ అయ్యే విధంగా మలచబడింది. ఏ పాత్ర కయినా  వందశాతం న్యాయం చేసే హీరో ఆది ఈ మూవీలో  అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రతో మెప్పించబోతున్నాడు.  ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అవుతున్న సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ద‌ర్శకుడు విశ్వనాథ్ ఆరిగెల మాట్లాడుతూ…‘ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో ముందుకు కదిలి ఇప్పుడు రిలీజ్ వరకూ వచ్చింది. అందులో ఒకరు ప్రొడ్యూసర్ విజయలక్ష్మి గారు కథ వినగానే అందులోని ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యారు.

ఇప్పుడు ఇది చెప్పాల్సిన కథ అని అన్నారు. మరొకరు శ్రద్ధా శ్రీనాథ్ కథ వినగానే మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని అన్నారు. అప్పటి నుండి ఎన్ని అవాంతరాలొచ్చినా నాకు సపోర్ట్ గా నిలిచారు. మరొకరు హీరో ఆది గారు ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనే. ఈ సినిమా కథ వినగానే ఇలాంటి కథ కోసమే నేను చూస్తున్నా అన్నారు. నరేష్ గారు పాత్ర కు చాలా బాగా వచ్చింది. సినిమాకు ఆ పాత్ర బలంగా మారుతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఫణి నేను కొత్త ట్యూన్స్ కోసం చాలా డిస్కషన్స్ చేసాం . ఇప్పుడు ఆల్బమ్ బాగుంది అంటున్నారు. ఇందులో మాటలు, పాటలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ సినిమా కోసం నాతో ట్రావెల్ చేసిన ప్రతి టెక్నిషన్స్ కి థ్యాంక్స్ చెబుతున్నాను’ అన్నారు.

సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ మాట్లాడుతూ… ‘కొన్ని సినిమాలు నచ్చి చేస్తాం. కొన్ని మోహమాటం కోసం చేస్తాం. మరి కొన్ని సినిమాలు స్పాన్ ని చూసి చేస్తాం కానీ… ఇందులో నా పాత్రను చాలా నచ్చి చేసాను. కథ చెప్పగానే దర్శకుడ్ని కంగ్రాట్స్ చేసాను. ఈ సినిమాలో చాలా సీన్స్ ని నేను నిజ జీవితంలో చూసాను. అందకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. హీరో ఆది నాకు చాలా కాలంగా తెలుసు. ఏ ఎమోషన్ అయినా చాలా బాలెన్సెడ్ గా చేస్తాడు. అతనికి జోడి మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాను. శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ విజయ లక్ష్మి గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమాను నిర్మించారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు ఒక మంచి సినిమాలో నేను ఉన్నానని గర్వంగా చెప్పగలను ’ అన్నారు.

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ… ‘జెర్సీ తో తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కథ వినగానే చాలా నచ్చింది. వింటూనే చాలా సార్లు నవ్వుకున్నాను. దర్శకుడు విశ్వనాథ్ ఈ కథను బాగా డిజైన్ చేసాడు. రెగ్యులర్ హీరోయిన్  ఇమేజ్ తో నా పాత్ర ఉంటుంది. ఆది చాలా సపోర్టింగ్ కోస్టార్. ఈ సినిమా తో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి.  దర్శకుడు ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు.  ప్రొడ్యూసర్  విజయలక్ష్మి గారి ఇన్వాలెమెంట్ చాలా ఉంది. ఫణి ఇచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి. తప్పకుండా అంద‌రికీ నచ్చేపాత్ర అవుతుందని నమ్ముతున్నాను ’ అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ… ‘నేను ఎప్పటి నుండో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీ చేయాలనుకుంటు న్నాను. అదే టైం విశ్వనాథ్ కథ చెప్పగానే నేను బాగా కనెక్ట్ అయ్యాను.  విన్నప్పుడు కలిగిన ఫీల్ స్క్రీన్  మీద మరింతగా పెరిగింది. శ్రద్ధా చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. తన యూటర్న్ మూవీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక చాలా మంది తెలిసిన వాళ్ళు కాల్ చేసి చాలా క్రొత్త గా ఉన్నావు అంటుంటే చాలా హ్యాపీగా ఉంది.  నరేష్ గారు సెట్ లో ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.  వండర్ పుల్ యాక్టర్ తో పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వెన్నెల కిషోర్ నా కోసం ఈ సినిమా చేసాడు చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ విజయలక్ష్మి గారు ఈ సినిమా కోసం చాలా ఎఫెర్ట్స్ పెట్టారు. సెప్టెంబర్ 6న రాబోతున్నాం, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాం  అనే నమ్మకం ఉంది ’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here