Home News ఈ నాయ‌కుల‌కు బుద్ధి రావాలంటే.. జ‌న‌సేన పార్టీని భారీ ఎత్తున గెలిపించాలి. – ఆదోని జ‌న‌సేన...

ఈ నాయ‌కుల‌కు బుద్ధి రావాలంటే.. జ‌న‌సేన పార్టీని భారీ ఎత్తున గెలిపించాలి. – ఆదోని జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప‌

82
0


ఆదోనిలో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధి మ‌ల్ల‌ప్ప విస్త్రృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈరోజు ఆయ‌న ఇంటి నుంచి ర్యాలీగా బ‌య‌లుదేరి నామినేష‌న్ వేసారు. ఈ కార్య‌క్ర‌మంలోజ‌న సైనికులు, కార్య‌క‌ర్త‌లు భారీ స్ధాయిలో పాల్గొన్నారు. నామినేష‌న్ వేసిన అనంత‌రం మ‌ల్లప్ప మాట్లాడుతూ… జ‌న‌సేన‌, సీపీఐ, బిఎస్పీ కూట‌మిని ప్ర‌జ‌లు భారీ ఎత్తున విశేషంగా ఆద‌రిస్తున్నారు. కార‌ణం ఏంటంటే…25 ఏళ్లుగా ఆదోని అన్ని రంగాల్లో వెన‌క‌బ‌డింది. విద్యా, వైద్య‌, వ్య‌వ‌సాయ‌, పారిశ్రామిక..ఇలా ప్ర‌తి రంగంలో వెనక‌బ‌డింది.

మీనాక్షి నాయుడు గారు మూడు సార్లు అంటే 15 ఏళ్లు, సాయిప్ర‌సాద్ రెడ్డి గారు 2 సార్లు అంటూ 10 సంవ‌త్స‌రాలు ఎన్నుకోబ‌డ్డారు. వీళ్లు ఏ మాత్రం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద దృష్టి పెట్టింది లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య పై పోరాడింది లేదు. అందుకే ప్ర‌జ‌లంద‌రూ ముక్త కంఠంతో ప్ర‌త్యామ్నాయ వేదిక రావాలి అనుకుంటున్న త‌రుణంలో జ‌న‌సేన, సిపీఐ, బీఎస్పీ కూట‌మి రావ‌డంతో ఈ కూట‌మిని స్వాగ‌తిస్తున్నారు. జ‌న‌సేన పార్టీ ఆదోని నియోజ‌క‌వ‌ర్గాన్ని ఖ‌చ్చితంగా అభివృద్ధి చేయ‌గ‌ల‌దు అని న‌మ్ముతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నిర్ల‌క్ష్యానికి కార‌కులైన ఈ నాయ‌కుల‌కు బుద్ధి రావాలంటే కూట‌మి భారీ ఎత్తున గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. గెలిచిన త‌ర్వాత ప్ర‌జ‌ల్లోనే ఉంటాం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటాం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఆల‌స్యం చేయ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్కారం చేస్తామ‌ని తెలియ‌చేస్తున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here