Home Actor ఈ నెల 10న మా ఎన్నిక‌లు. వేడెక్కుతోన్న సినీ రాజ‌కీయం..!

ఈ నెల 10న మా ఎన్నిక‌లు. వేడెక్కుతోన్న సినీ రాజ‌కీయం..!

103
0


ప్ర‌స్తుతం మా అధ్య‌క్షుడుగా ఉన్న శివాజీరాజా ప‌ద‌వీకాలం త్వ‌ర‌లో పూర్త‌వ్వ‌నుంది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఈ నెల 10న నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీరాజా మ‌రోసారి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు. అయితే…సీనియ‌ర్ హీరో న‌రేష్ కూడా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తుండ‌డంతో మా ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. సీనియ‌ర్ న‌రేష్ తో పాటు అత‌ని ఫ్యాన‌ల్ స‌భ్యులు జీవితా రాజ‌శేఖ‌ర్ చిరంజీవిని క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వ‌ల‌సిందిగా కోరారు. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును కూడా క‌లిసారు.

ఇక ఈరోజు శివాజీరాజాతో పాటు ప్యాన‌ల్ స‌భ్యులు శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉత్తేజ్, త‌నీష్ త‌దిత‌రులు చిరంజీవిని క‌లిసి మా అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ కు విజ్ఞప్తి చేసారు. ఇలా పోటాపోటీగా శివాజీరాజా, న‌రేష్ సినీ ప్ర‌ముఖుల‌ను క‌లిసి త‌మ ప్యాన‌ల్ కే ఓటు వేయాల‌ని ప్ర‌చారం చేస్తుండ‌డంతో మ‌రింత ఆస‌క్తి పెరుగుతోంది. మ‌రి..ఈసారి మా అధ్య‌క్షుడుగా ఎవ‌రు గెలుస్తారో తెలియాలంటే ఈ నెల 10 వ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here