Home Uncategorized ఈ నెల 11న కౌంటింగ్ కు విస్తృతఏర్పాట్లు..!

ఈ నెల 11న కౌంటింగ్ కు విస్తృతఏర్పాట్లు..!

107
0

ఈ నెల 11న హైదరాబాద్ జిల్లాలో కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి దాన కిషోర్‌ తెలిపారు. 15 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు , రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్‌ను ఏర్పాటు చేశామని దాన కిషోర్ వెల్లడించారు.  ప్ర‌తి టేబుల్ వ‌ద్ద కౌంటింగ్ సూప‌ర్ వైజ‌ర్, అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్, మైక్రో అబ్జ‌ర్వ‌ర్ ఉంటార‌న్నారు.

ఓట్ల లెక్కింపు సిబ్బందికి తొలి విడ‌త శిక్ష‌ణ పూర్త‌య్యింద‌న్నారు. లెక్కింపులో ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ లు లెక్కించ‌నున్నారు. 10న రెండవ విడత శిక్షణ ఉంటుందని చెప్పారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ ఏజెంట్‌ ఉంటారన్నారు. మొబైల్ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతించబోమని దాన కిషోర్‌ స్పష్టం చేశారు. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు, తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ టీవీ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, భారత ఎన్నికల సంఘం పర్యవేక్షించేందుకు అవకాశం ఉందని ఎన్నికల అధికారి దానకిషోర్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here