Home Actor ఈ నెల 7న ఇస్మార్ట్ శంక‌ర్ బోనాలు ఈవెంట్. ఇంత‌కీ ఎక్క‌డ‌..?

ఈ నెల 7న ఇస్మార్ట్ శంక‌ర్ బోనాలు ఈవెంట్. ఇంత‌కీ ఎక్క‌డ‌..?

37
0
ఈ నెల 7న ఇస్మార్ట్ శంక‌ర్ బోనాలు ఈవెంట్. ఇంత‌కీ ఎక్క‌డ‌..? spiceandhra

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది.  ఈ చిత్రంలో రామ్ సరసన నభ నటేష్, నిధి అగర్వాల్ న‌టించారు. ఈ సినిమాలో రామ్ ఒక పక్కా తెలంగాణ ప్రాంత మాస్ కుర్రాడిగా నటిస్తున్నారు.

  ట్రైలర్ లో రామ్ చెప్పిన  ‘ఏ బొమ్మా  .. నువ్వు ‘ఊ’ అంటే గోల్కొండ రిపేరు జేసి నీ చేతిలో పెడతా. నిన్ను బేగంను చేసి ఖిల్లా మీద కూర్చో పెడతా.. క్యా బోల్తే..ఆ’ అనే డైలాగు,  ‘ఒరేయ్, వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించినా..’ అంటూ నభా నటేశ్ చెప్పిన డైలాగు చి క్రేజీగా మారి సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న తమ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ ని అందుకుంటుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బోనాలు పేరుతో ఈనెల 7న సాయంత్రం 6 గంటలకు, వరంగల్ జిల్లాలోని హన్మకొండలో గల హైగ్రీవాచారి గ్రౌండ్ లో యూనిట్ సభ్యులు మరియు అతిరథ మహారథుల సమక్షంలో ఎంతో వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతల నుండి మంచి స్పందనను రాబడుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమాని ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here