Home Actor ఈ నెల 9న ‘మన్మధుడు – 2’ లో అవంతిక లుక్ రిలీజ్.

ఈ నెల 9న ‘మన్మధుడు – 2’ లో అవంతిక లుక్ రిలీజ్.

51
0
ఈ నెల 9న ‘మన్మధుడు – 2’ లో అవంతిక లుక్ రిలీజ్. spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టి మ‌న్మ‌థుడు. ఈ చిత్రానికి సీక్వెల్ అనేలా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ఈ చిత్రంలో నాగ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. చి ల సౌ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ & టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

అయితే టీజర్ లో హీరోయిన్ ర‌కుల్  పాత్రను మాత్రం ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఈనెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు తమ చిత్రంలో అవంతికగా నటిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 2002 లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున నటించిన రొమాంటిక్ మూవీ మన్మథుడు కు సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రొమాంటిక్ స్టయిల్లో మంచి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్,  అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.  సీనియర్ నటి లక్ష్మి, నాజర్, వెన్నెల కిశోర్, రావు రమేష్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here