Home Actor ఈ బర్త్ డే నాకు చాలా ‘స్పెషల్ – ‘స్పెషల్’ మూవీ హీరోయిన్...

ఈ బర్త్ డే నాకు చాలా ‘స్పెషల్ – ‘స్పెషల్’ మూవీ హీరోయిన్ ‘అక్షత శ్రీనివాస్’

39
0

తెలుగు సినిమా రంగంలోనే కాదు..అన్ని భాషల్లోనూ కన్నడ భామలు కదం తొక్కుతున్నారు. బాలీవుడ్ లో ఐశ్వర్యారాయ్, దీపికా పడుకోన్ చక్రం తిప్పుతుంటే.. తెలుగులో అనుష్క శెట్టి, రష్మిక మందన్న, తాజాగా శ్రద్ధా శ్రీనాధ్ వెలుగులీనుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు మరో కన్నడ భామ ‘అక్షతా శ్రీనివాస్’ సన్నాహాలు చేసుకుంటోంది.

కన్నడలో.. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సర్జా (యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు) సరసన ‘శివ తేజస్’ సినిమా చేస్తున్న అక్షత అక్కడే.. ‘బ్రహ్మచారి- హండ్రెడ్ పర్శంట్ వర్జిన్’ అనే మరో క్రేజీ సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పుడు తాజాగా ‘స్పెషల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

టాలెంటెడ్ యాక్టర్ అజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి వాస్తవ్ దర్శకత్వం వహిస్తున్నారు.  మే 1న  తన పుట్టిన రోజును పురస్కరించుకుని అక్షత మాట్లాడుతూ.. “కన్నడలో రెండు క్రేజీ సినిమాలు చేస్తూ.. తెలుగులో “స్పెషల్”మూవీ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ బర్త్ డే నాకు చాలా చాలా స్పెషల్.  తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా డ్రీమ్” అని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here