Home Actor ఈ సారి ఎన్నిక‌ల్లో ఏకంగా ఆరుగురు టాప్ హీరోయిన్స్ పోటీ..డిటెయిల్స్ మాత్రం భ‌లే క్రేజీ..!

ఈ సారి ఎన్నిక‌ల్లో ఏకంగా ఆరుగురు టాప్ హీరోయిన్స్ పోటీ..డిటెయిల్స్ మాత్రం భ‌లే క్రేజీ..!

104
0

ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌లు దాదాపు నెల‌న్న‌ర రోజుల పాటు సాగుతున్నాయి. ఈ సారి క్రేజీ అంతా ఉత్త‌రాది రాష్ట్రాల్లోనే ఉంది. ఎందుకంటే ఒక‌రు, ఇద్ద‌రు కాదు ఏకంగా ఆరుగురు టాప్ రేంజ్ హీరోయిన్స్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. త‌డాఖా చూపిస్తామంటూ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు.

ఈ సారి ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నం గా నిలుస్తున్న హీరోయిన్ గా జ‌య‌ప్ర‌ద ను మొద‌ట‌గా చెప్పుకోవ‌చ్చు. రాంపూర్ నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తున్నారు. ఆమె మీద ప్ర‌త్య‌ర్థి ఆజంఖాన్ లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. అయినా వాటిని త‌ట్టుకొంటూ ప్ర‌చారంలో దూసుకెళుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట్లు ప‌ట్టిస్తున్నారు. 2004 ఎన్నిక‌ల్లో ఇదే స్థానం నుంచి ఆమె స‌మాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.

మ‌రో టాప్ హీరోయిన్ హేమ‌మాలిని ఇప్ప‌టికే బీజేపీ త‌ర‌పున మ‌ధుర నుంచి ఎంపీగా ప‌నిచేస్తున్నారు. అదే సీటు నుంచి ఆమె మ‌రోసారి పోటీలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికే ఆమె సిట్టింగ్ ఎంపీ కావ‌టంతో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌టం తేలిక‌గానే అనిపిస్తోంది. ఈ ప్రాంతం బీజేపీ కి ప‌ట్టు ఉన్న ప్రాంతం కావ‌టం కూడా క‌లిసి వ‌స్తోంది.

ముంబైలో అంద‌రి దృష్టి ఊర్మిళా మ‌డోద్క‌ర్ మీద‌నే ఉంది. ఇటీవ‌లే ఆమె కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యారు. ఆ వెంట‌నే ముంబై నార్తు టికెట్ ద‌క్కించుకొని బ‌రిలోకి దిగిపోయారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో హోరెత్తిస్తూ కొత్త ర‌కం రంగీలా సినిమా చూపిస్తున్నారు. ఊర్మిళా చేస్తున్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు ఇప్పుడు ముంబై మీడియాను బాగా ఆక‌ర్షిస్తున్నాయి.

జోధా అక్బ‌ర్ లో న‌టించి క్రేజ్ సంపాదించుకొన్న పూన‌మ్ సిన్హా ఇప్పుడు స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌పున బ‌రిలో ఉన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి ఆమె అదృష్టాన్ని ప‌రీక్షించుకొంటున్నారు.

 అటు ప‌శ్చిమ బెంగాల్ లో హాట్ భామ‌గా పేరు తెచ్చుకొన్న న‌స్ర‌త్ జ‌హాన్ ..తృణ‌మూల్ కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తున్నారు. మోడ‌ల్ గా, హీరోయిన్ గా ఆమె ఇప్ప‌టికే అక్క‌డ మార్కెట్ లో దుమ్ము రేపి ఉన్నారు. తాజాగా రాజ‌కీయాల్లో పై చేయి సాదిస్తాన‌ని చెబుతున్నారు. మ‌మ‌త దీదీ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌రో హీరోయిన్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. గ్లామ‌ర్ క్వీన్ గా పేరు తెచ్చుకొన్న మిమి చ‌క్ర‌వ‌ర్తి ని జాద‌వ్ పూర్ నుంచి బ‌రిలోకి దింపుతున్నారు. మొత్తం మీద ఈ హీరోయిన్ల ప్ర‌చార ప‌ద‌నిస‌ల‌తో ఉత్త‌రాది ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం గ్లామ‌ర్ రంగును పులుముకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here