Home Political News ఉత్కంఠ క‌లిగిస్తోన్న పోలింగ్ శాతం..!

ఉత్కంఠ క‌లిగిస్తోన్న పోలింగ్ శాతం..!

115
0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఈరోజు ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే..కొన్ని చోట్ల ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డం..స‌రైన స‌దుపాయాలు క‌ల్పించ‌క‌పోవ‌డం..ఓట‌ర్లు త‌మ పేరు లేదంటూ పోలింగ్ బూత్ ల నుంచి వెనుతిర‌గడం..వ‌రుస సెల‌వుల కార‌ణంగా చాలా మంది ఊర్ల‌కు వెళ్లిపోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న పోలింగ్ శాతం త‌క్కువే న‌మోదైంది. రూర‌ల్ లో పెద్ద ఎత్తున ఓట‌ర్లు త‌మ ఓటు విన‌యోగించుకున్న‌ప్ప‌టికీ హైద‌రాబాద్ లో మాత్రం ఓటు వేయ‌డానికి అంత‌గా ఆస‌క్తి చూప‌లేద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా పాత బ‌స్తీలో చాలా త‌క్కువుగా పోలింగ్ శాతం నమోదైంది.

మొత్తానికి హైద‌రాబాద్ లో ఎక్క‌డ చూసిన పోలింగ్ బూత్ లు జ‌నం లేక బోసిపోయాయ‌ని చెప్ప‌చ్చు. ఓటింగ్‌ శాతం పెంచేదిశగా ఎన్నికల కమిషన్‌, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పలు కార్యక్రమాలు చేపట్టారు. కానీ..ప్ర‌జ‌ల్లో మాత్రం ఆశించిన స్ధాయిలో స్పంద‌న రాలేద‌ని చెప్ప‌చ్చు. పోలింగ్ శాతాన్ని బ‌ట్టి ఆయా పార్టీ అభ్యర్థులు, పార్టీలు.. తమ గెలపోటముల పై ఓ అంచనాకి వ‌స్తుంటారు. అయితే..ఈసారి త‌క్కువ పోలింగ్ న‌మోదు కోవ‌డంతో ఆయా పార్టీలు, అభ్య‌ర్ధులు ఓట‌ర్లు ఏ తీర్పు ఇచ్చారు అనేది ఉత్కంఠ‌గా మారింది. ఎవరి అంచనాలు ఎలా వున్నా… వాస్తవ ఫలితం మాత్రం ఈ నెల‌ 11న తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here