Home Political News ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌ల‌నే కాంగ్రెస్ ఓట‌మి – కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి గ‌జ్జెల కాంతం.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌ల‌నే కాంగ్రెస్ ఓట‌మి – కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి గ‌జ్జెల కాంతం.

107
0

టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి గ‌జ్జెల కాంతం ఫైర్ అయ్యారు. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవ‌డానికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డే కార‌ణమ‌ని… కాంగ్రెస్ పార్టీ ని సర్వ నాశనం చేశార‌ని ఆయ‌న‌ విమ‌ర్శించారు. రాహూల్ గాంధీ ని తెలంగాణ ప్రజలు నమ్మారు కానీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని తెలంగాణ ప్రజలు నమ్మలేదు అన్నారు. ఓడినా.. గెలిచినా.. నైతిక బాధ్యత తీసుకుంటాను అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్ర‌శ్నించారు.

 పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు  2014లో  21 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 19 సీట్లు వచ్చాయి. పీసీసీ ప్రెసిడెంట్ గా పొన్నాల ను రాజీనామా చేయించారు. బీసీలు పీసీసీ పనికి రారు అని చెప్పి పొన్నాల‌ను పీసీసీ నుండి రాజీనామా చేయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అయ్యాకా వచ్చిన ghmc ఎలక్షన్ లో  కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచింది. తరువాత వచ్చిన ఎలక్షన్ లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలుమీ నాయకత్వంను ఒప్పుకోవడం లేదు అందుకే ఓటుతో ఉత్త‌మ్ కు బుద్ధి చెప్పారు అన్నారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మీనిస్టర్ గా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలను బయట పెట్టకూడదని  వాళ్ళ తో లాలూచీ పడ్డారు. కేసీఆర్ చెప్పినట్టు విన్నాడు. కుంభకోణాలు బయట పెట్టకూడదని  సరెండర్ అయ్యాడు. మై హోమ్ రామేశ్వరరావు తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ సీట్లు లేట్ గా ప్రకటించారు. కూటమి ఏర్పాటు విషయం పై   జాతీయ నాయకులను తప్పు పట్టించారు.కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టుకుని కోట్ల రూపాయలు దండుకున్నావ్ అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని విమ‌ర్శించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలంగాణ  ఉద్యమ కారుడివి కాదు. అందుకే ఆయ‌నికి ప్రజలు బుద్ధి చెప్పారు. కోదండరామ్ కేసీఆర్ సూచించిన మనిషి. ఉద్యమకారుడు మేధావి మాత్రమే మేధావి తనం వాడుకోవాలి కానీ ఆయన పెట్టిన  పార్టీ ని ఎందుకు కూటమి లో కలిపావ్ అని ప్ర‌శ్నించారు.  రాజీనామా చేయాలి కానీ సిగ్గు లేకుండా మీటింగ్ ఎలా పెడుతావ్.  ఉద్యమ కారులను కించపరిచాడు.  దళిత నాయకులను కించపరిచారు. పార్టీలో ఉన్న‌ కోవర్ట్ లు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి అని చెప్పారు. ఓటమి కి ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహించి  పీసీసీ కి రాజీనామా చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు పీసీసీ, సీఎల్పీ పోస్ట్ ఇవ్వాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here