Home Telugu ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ టైటిల్ కాబోయే అల్లుడు..!

ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ టైటిల్ కాబోయే అల్లుడు..!

115
0

మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ తెర పైకి రావ‌డం..అద్భుత విజ‌యం సాధించ‌డం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. అయితే…డైరెక్ట‌ర్ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో..ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ఎవ‌రు డైరెక్ట్ చేయ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల తేజతో చ‌ర్చ‌లు జ‌రిపారని…దీంతో ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు తేజ ఒప్పుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రావ‌చ్చు అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే..ఊహించ‌ని విధంగా తేజ హీరో ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. చిత్రం సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన ఉద‌య్ కిర‌ణ్ ఆత‌ర్వాత నువ్వు – నేను, మ‌న‌సంతా నువ్వే చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఆత‌ర్వాత చిరంజీవి కుమార్తెతో ఉద‌య్ కిర‌ణ్ కి నిశ్చితార్ధం  అవ్వ‌డం..కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆగిపోవ‌డం తెలిసిందే. కెరీర్ లో కూడా వెన‌క‌ప‌డ‌డంతో కొంత కాలం క్రితం త‌న ఇంట్లోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే…ఈ బ‌యోపిక్ లో చిరంజీవి క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ట‌. ఈ పాత్ర‌ను రాజ‌శేఖ‌ర్ తో చేయించాలనుకుంటున్నార‌ట తేజ‌. దీనికి కాబోయే అల్లుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నార‌ని తెలిసింది. అయితే..ఉద‌య్ కిర‌ణ్ ఆర్ధిక ఇబ్బందులు వ‌ల‌నే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కొంత మంది అంటే…ఉద‌య్ కిర‌ణ్ కి ఆర్ధిక ఇబ్బందులు లేవ‌ని ఆయ‌న సోద‌రి శ్రీదేవి తెలియ‌చేసారు. ఇలా… ఆత్మ‌హ‌త్య  వెన‌క ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. దీంతో ఆత్మ‌హ‌త్య గురించి ఏం చెప్ప‌నున్నారు..?  ఉద‌య్ కిర‌ణ్ పాత్ర‌ను ఎవ‌రు పోషించ‌నున్నారు…?  చిరు కుమార్తెతో పెళ్లి క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణం ఏం చూపించ‌నున్నారు..?  అనేది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here