Home Political News ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వ్యాపార సంస్థ‌ల్లో ఐటీ సోదాలు

ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వ్యాపార సంస్థ‌ల్లో ఐటీ సోదాలు

102
0
122117KHAMMAM-MP

హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఇంట్లో ఇన్ క‌మ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేసారు. ఖ‌మ్మంలోను, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి సంబంధించిన క‌న్ స్ట్ర‌క్ష‌న్స్, ప్రాజెక్ట్ ఆఫీసుల పై సోదాలు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ లో 12 చోట్ల‌, ఖ‌మ్మంలో 6 చోట్ల ఏక కాలంలో సోదాలు జ‌రుగుతున్నాయి. ఖ‌మ్మంలోని శ్రీశ్రీ స‌ర్కిల్ లో స‌మీపంలోని పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి నివాసంలో ఉద‌యం 9 గంట‌ల నుంచి సోదాలు ప్రారంభించారు.

మ‌రో వైపు హైద‌రాబాద్ లోని బంజారా హిల్స్ రాఘ‌వ ఇన్ ఫ్రా కార్యాల‌యంలో కూడా ఈ సోదాలు చేస్తున్న‌ట్టు తెలిసింది.ఈ సోదాలపై ఎంపీ పొంగులేటి స్పందిస్తూ… ఇవి సాధారణ సోదాలేనని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి 2016 ఏప్రిల్‌లో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ కి మ‌ద్దతుగా ఉన్న‌ ఎంపీ పై ఐటీ సోదాలు జరగటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాలు రేపు కూడా జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here