Home Political News ఎంవీవీఎస్ మూర్తి మృతి టీడీపీకి తీర‌నిలోటు – చంద్ర‌బాబు

ఎంవీవీఎస్ మూర్తి మృతి టీడీపీకి తీర‌నిలోటు – చంద్ర‌బాబు

95
0

హ‌రికృష్ణ‌, కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, సోమ‌ల‌ను కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు.  అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ…మూర్తి మృతి దిగ్బ్రాంతికి గురి చేసింద‌ని.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు  సంతాపాన్ని తెలియజేశారు. తెలుగు దేశం ఆవిర్భావం నుంచి పని చేస్తున్నారని.. సంక్షోభాల సమయంలో అండగా నిలిచారని ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.

పార్టీకి పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు టీడీపీ అధినేత. ఈ మధ్యే విశాఖలో పార్టీ కార్యాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని తెలియ‌చేసారు. వరుస ఘటనల్లో పార్టీ ముఖ్య నేతల్ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు చంద్రబాబు. హరికృష్ణ, కిడారి సర్వేశ్వరరావు, సోమ, మూర్తిల మృతి పార్టీకి తీరని లోటన్నారు. కేబినెట్‌ భేటీలో కూడా మూర్తి, కిడారి, సోమ మృతికి సంతాపం తెలిపి వాయిదా వేయాలని నిర్ణయించారు.

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ.. మూర్తి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.ఎంపీగా, శాసనమండలి సభ్యులుగా విశాఖ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్నారు.  విద్యా రంగం అభివృద్ధికి నిరంతరం తపించే వ్యక్తి అని… ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here