Home Movie News ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ముహుర్తం ఖ‌రారు..!

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ముహుర్తం ఖ‌రారు..!

155
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌స్తుతం ఫారిన్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. కొన్ని రోజులుగా అక్క‌డ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన పాట‌ల‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. హ‌రిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ అభిమానులుకు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎక్క‌డ‌..? ఎప్పుడు..? అనే ఆసక్తి మొదలైంది. హైద‌రాబాద్ లో చేస్తారా..? లేక తిరుప‌తిలో చేస్తారా..?  అని చ‌ర్చించుకుంటున్నారు. తాజా స‌మాచ‌రం ప్రకారం హైద‌రాబాద్ లోనే చేయాల‌ను కుంటున్నార‌ని తెలిసింది. ఎప్పుడు చేయ‌నున్నారంటే..వచ్చేనెల 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాల‌ని నిర్మాణ సంస్థ‌ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలతో పాటు హీరో జాతకాన్ని కూడా పరిశీలించిన పండితులే ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట.

ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎక్కువుగా ఆదివారం చేస్తారు కానీ…అక్టోబ‌ర్ 2 మంగ‌ళ‌వారం అయిన‌ప్ప‌టికీ ముహుర్తం బాగుంద‌ని ఆరోజు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ కి  మంచి రెస్పాన్స్ వచ్చింది. మ‌రి..అర‌వింద స‌మేత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here