Home Movie News ఎన్టీఆర్ అర‌వింద స‌మేత రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత రిలీజ్ డేట్ ఫిక్స్..!

135
0
302b33c9-131d-4414-8e11-86e25ed07fdb

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల స్పీడు పెంచారు.

దసరా కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఈ దసరాకి సిద్ధంగా ఉండండి. అరవింద సమేత-వీర రాఘవ అక్టోబర్ 11న మీ దగ్గర్లోని థియేటర్లకి వస్తున్నాడు  అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అంతే కాకుండా రిలీజ్ డేట్ ఫైన‌ల్ చేస్తూ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. ఎప్ప‌టి నుంచో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా రావాల‌ని అభిమానులు ఎదురు చూసారు. ఆఖ‌రికి ఇన్నాళ్ల‌కి ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. దీంతో అర‌వింద స‌మేత పై ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి…అర‌వింద స‌మేత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.


 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here