Home Political News ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది – ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది – ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

117
0
1457769754-128

తెలంగాణ‌లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం..మ‌హా కూట‌మిగా ఏర్ప‌డ‌డం తెలిసిందే. అయితే..కాంగ్రెస్, టీడీపీ పొత్తు గురించి టీఆర్ఎస్  నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్పందిస్తూ…కాంగ్రెస్, టీడీపీది ఘోర‌మైన పొత్తు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. కాంగ్రెస్ కేడ‌ర్ టీడీపీకి స‌హ‌క‌రించ‌దు. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డానికి కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. కొండా దంప‌తులను ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు.25 ఏళ్లుగా త‌న‌ని తిడుతూ రాజ‌కీయ ల‌బ్ది పొందుతున్నార‌న్నారు.

బాబ్లీ పాపం కాంగ్రెస్ దే. బీజేపీని నిందించ‌డం స‌రికాదు. మ‌హారాష్ట్ర‌లో అప్ప‌టి కాంగ్రెస్ కేసు పెట్టింది. ఈ కేసుతో కేసీఆర్ కు సంబంధం లేదని… బాబ్లీ ప్రాజెక్ట్ పై టీటీడీపీ ఎమ్మెల్యేంద‌రూ ఆందోళ‌న  చేసారు. చంద్ర‌బాబు మా ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికార‌న్నారు. ఇదే విష‌యం పై మంత్రి ఆనంద్ బాబు స్పందిస్తూ…ఉత్త‌ర తెలంగాణ బీడు మారుతుంద‌ని..బాబ్లీ పై లిఫ్ట్ ఇరిగేష‌న్ల‌ను వ్య‌తిరేకించాం. నిర‌స‌న తెలిపేందుకు వెళితే నిర్భంథించి థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారు. ఎనిదేళ్ల త‌ర్వాత వారెంట్ రావ‌డం హాస్యాస్ప‌దం. చంద్ర‌బాబుది, ప్ర‌తి ప‌క్షాల‌ది నీతిమాలిన చ‌ర్య‌. జీవీఎల్ నోరు అదుపులో పెట్టుకోని స్ధాయికి త‌గ్గ‌ట్టు మాట్లాడాలి. ఈ కేసు గురించి కేసీఆర్, ప‌వ‌న్ స్పందించాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here