Home Actor ఎన్టీఆర్, కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్ తో సినిమా. ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు.?

ఎన్టీఆర్, కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్ తో సినిమా. ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు.?

67
0
ఎన్టీఆర్ కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్ తో సినిమా. ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు.? spiceandhra

కె.జి.ఎఫ్ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా కె.జి.ఎఫ్ చాప్ట‌ర్ 2 షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే.. క‌న్న‌డ‌లో రూపొందిన ఈ సినిమాకి తెలుగు, హిందీలో కూడా విశేషాద‌ర‌ణ ల‌భించింది. దీంతో కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేసేందుకు హీరోలు, నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్నాడు అని.. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల గురించి మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌వీన్ ఎర్నేని ని అడిగితే… ఎన్టీఆర్ గారే అత‌నితో సినిమా చేస్తే బాగుంటుంద‌న్నారు.

ఆయ‌న‌కు కె.జి.ఎఫ్ బాగా న‌చ్చింది. క‌థ ఉంటే విందామ‌ని చెప్పారు. ప్ర‌శాంత్ నీల్ ని  కాంటాక్ట్ చేసాం. ఇంకా క‌థ చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్ కంప్లీట్ చేయాలి. ఆయ‌న కె.జి.ఎఫ్ 2 కంప్లీట్ చేయాలి సో.. టైమ్ ప‌డుతుంది. నెక్ట్స్ ఇయ‌ర్ ఎండింగ్ లో ఈ సినిమా ఉండ‌చ్చు అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here