Home Political News ఎన్టీఆర్ గెట‌ప్ లో ఉన్న బాల‌య్య‌ను క‌లిసి టీటీడీపీ నేత‌లు..!

ఎన్టీఆర్ గెట‌ప్ లో ఉన్న బాల‌య్య‌ను క‌లిసి టీటీడీపీ నేత‌లు..!

93
0

నంద‌మూరి బాలకృష్ణను టీ.టీడీపీ కీలక నేతలు ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ పార్ట్‌-2 షూటింగ్ జ‌రుగుతోంది. ఈ షూటింగ్ లో  ఉన్న బాలకృష్ణను కలిసి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రావాల‌ని ఆహ్వానించారు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్‌ పార్టీ పెట్టే సీన్‌ని చిత్రీకరిస్తుండగా ఈ నేతలు వెళ్లడంతో.. వారంతా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రచారానికి రమ్మని కోరిన టీటీడీపీ నేతల ప్రతిపాదన పట్ల బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

ఈ సంద‌ర్భంగా టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ మాట్లాడుతూ…ఆనాటి ఎన్టీఆర్ వైభ‌వం ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కనిపించ‌నుంది. తెలంగాణ‌లో పార్టీకి అండ‌గా ఉండాల‌ని బాల‌కృష్ణ‌ను కోరాం. నంద‌మూరి, నారా కుటుంబాల సేవ‌ల‌ను ఈ ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకుంటాం అని తెలియ‌చేసారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ…ఎన్టీఆర్ బ‌యోపిక్ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. బాల‌కృష్ణ న‌ట‌న చూస్తుంటే…ఎన్టీఆరే స్వ‌యంగా న‌టిస్తున్న‌ట్లు అనిపిస్తోంది. ఎన్టీఆర్ అండ‌దండ‌ల‌తో ఈ ఎన్నిక‌ల్లో విజ‌య‌భేరి మోగిస్తాం. రాజ‌కీయాల పై బాల‌కృష్ణ‌తో చ‌ర్చించ‌లేదు అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here