Home Actor ఎన్టీఆర్, చ‌ర‌ణ్ కి రాజ‌మౌళి క‌థ ఎలా చెప్పాడో తెలుసా..?

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ కి రాజ‌మౌళి క‌థ ఎలా చెప్పాడో తెలుసా..?

78
0


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న‌ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అస‌లు క‌థ ఎలా ఉంటుంది.?  ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల పాత్ర‌లు ఎలా ఉంటాయి..?  ఇలా ర‌క‌ర‌కాల సందేహాలు. అయితే…రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ…రాజ‌మౌళి క‌థ చెప్పేట‌ప్పుడు ఎలాంటి షాక్ ఇచ్చారో బ‌య‌ట పెట్టారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే…ఓ రోజు రాజ‌మౌళి ఫోన్ చేసి చ‌ర‌ణ్ ని ఇంటికి ర‌మ్మన్నార‌ట‌.

చ‌ర‌ణ్ రాజ‌మౌళి ఇంటికి వెళ్లే సరికి..అక్క‌డ తార‌క్ ఉన్నార‌ట‌. అప్పుడు ఇద్ద‌రినీ రూమ్ లోకి తీసుకెళ్లి క‌థ చెప్పార‌ట‌. వెంట‌నే ఇద్ద‌రు చాలా హ్యాపీగా ఫీలై ఈ సినిమా చేస్తున్నామ‌న్నార‌ట‌. ఆ రోజు త‌న జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని రోజు అని చ‌ర‌ణ్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ప‌ది భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 350 నుంచి 400 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2020 జులై 30న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాత దాన‌య్య తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here