Home Movie News ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ – రాజ‌మౌళి మూవీ గురించి  3 ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్..!

ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ – రాజ‌మౌళి మూవీ గురించి  3 ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్..!

103
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా..?  అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. డీవీవీ దాన‌య్య ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే..ఈ భారీ క్రేజీ మల్టీస్టార‌ర్ గురించి 3 ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్ తెలిసాయి.

ఫ‌స్ట్ అప్ డేట్ ఏంటంటే…ఈ సినిమాలో ఇద్ద‌రు కాదు ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నార‌ట‌. వీరిలోఒక క‌థానాయిక‌గా ఫారిన్ బ్యూటీని ఎంపిక చేయ‌నున్నార‌ని తెలిసింది. ఇక సెకండ్ అప్ డేట్ ఏంటంటే..ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్ గా ఉంటుందట‌. ఈ ఎపిసోడ్ కోసం 45 రోజుల పాటు షూటింగ్ చేస్తార‌ట‌. హాలీవుడ్ స్ధాయిలో ఈ యాక్ష‌న్ సీన్స్ ఉంటాయ‌ట‌. ఇక ముచ్చ‌ట‌గా మూడో అప్ డేట్ ఏంటంటే..ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వం న‌వంబ‌ర్ 5న అని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here