Home Political News ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో టీటీడీపీ నేత‌ల అత్యవ‌స‌ర స‌మావేశం.

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో టీటీడీపీ నేత‌ల అత్యవ‌స‌ర స‌మావేశం.

109
0
636729572302261531

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలు ఈరోజు ఉదయం అత్యవసరంగా సమావేశమయ్యారు. బాబ్లీ ప్రాజెక్టు, పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశం పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వేగం పెంచాలని టీటీడీపీ నేతలు టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా సీట్ల స‌ర్ధుబాటు పై క్లారిటీ తీసుకోవాల‌ని.. వేగం పెంచాల‌ని అత్య‌వ‌స‌ర స‌మావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడేందుకు అమరావతికి నేతలు క్యూకడుతున్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి చంద్ర‌బాబు రావాల‌ని టీటీడీపీ నేత‌లు కోరుకుంటున్నారు. టీటీడీపీ నేత‌లంద‌రూ ఒక‌సారి చంద్ర‌బాబుని క‌లిసి ఈ విష‌య‌మై మాట్లాడాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here