Home Movie News ఎన్టీఆర్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన మాట‌ల మాంత్రికుడు..!

ఎన్టీఆర్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన మాట‌ల మాంత్రికుడు..!

96
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే…ఈ సినిమాలో పూజా హేగ్డేతో పాటు ఈషా రెబ్బాకూడా న‌టించింది. అయితే..ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభిన‌యం చేసార‌ని గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ క‌లిసి ఛాన‌ల్స్ కి ఇంట‌ర్ వ్యూస్ ఇచ్చారు. వారిద్ద‌ర‌ని… ప్ర‌చారంలో ఉన్న ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం గురించి అడిగితే…అలాంటి ఏమీ లేద‌ని. ఒక మంచి క‌థ‌ను నిజాయితీగా చెప్పాం త‌ప్పా..ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేయ‌లేదంటూ క్లారిటీ ఇచ్చారు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌ల‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. మ‌రి..అర‌వింద స‌మేత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here