Home Telugu ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

111
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే..మే 20 ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేయ‌నున్నార‌ని… గ‌త కొన్ని రోజులుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అయితే…ఎన్టీఆర్ లుక్ తో పాటు మూవీ టైటిల్ కూడా రిలీజ్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఎన్టీఆర్ లుక్ మాత్ర‌మే రిలీజ్ చేస్తారా…? లేక టైటిల్ కూడా రిలీజ్ చేస్తారా..? అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సస్పెన్స్ కి తెర దించుతూ హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈనెల 19న సాయంత్రం ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.  సో..ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండ‌గే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here