Home Movie News ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ ఎనౌన్స్ చేసిన క్రిష్‌..!

ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ ఎనౌన్స్ చేసిన క్రిష్‌..!

108
0
Doos9JuU8AAl-pD

నంద‌మూరి తారక రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్.బి.కె ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి బాల‌కృష్ణ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమాలో అక్కినేనిగా సుమంత్ న‌టిస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో రోజురోజుకు ఈ మూవీ పై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి.

ఈ రోజు ఉద‌యం డైరెక్ట‌ర్ క్రిష్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ చిత్రానికి ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలియ‌చేసారు. ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..అంటూ ఎన్టీఆర్ జాన‌ప‌ద చిత్రం చేసే వేళ ఎలా ఉంటాడో తెలియ‌చేసేలా  ఓ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేసారు. జనవరి 9 న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి…ఈ సంచ‌ల‌న చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here