Home Movie News ఎన్టీఆర్ బ‌యోపిక్ పార్ట్ 2 టైటిల్ & రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన క్రిష్..!

ఎన్టీఆర్ బ‌యోపిక్ పార్ట్ 2 టైటిల్ & రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన క్రిష్..!

93
0
DoqNOrQV4AAQsd2

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే..ఈ సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్పుడు మ‌హానటుడు, తెలుగుదేశం పార్టీని ఎనౌన్స్ చేసిన 8 నెల‌లోనే అధికారంలోకి తీసుకువ‌చ్చి చ‌రిత్ర సృష్టించిన గొప్ప రాజ‌కీయ నాయకుడు అయిన ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను రెండున్న‌ర గంట‌ల్లో చెప్ప‌డం సాధ్య‌మౌతుందా..? అనే సందేహం ఏర్ప‌డింది. అలా సందేహం ఏర్ప‌డిన అంద‌రికీ ఈరోజు క్రిష్ క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ ను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు డైరెక్ట‌ర్ క్రిష్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఫ‌స్ట్ పార్ట్ కి ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఫ‌స్ట్ పార్ట్ ని జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయ‌నున్నారు. ఇక సెకండ్ పార్ట్ కి మ‌హా నాయ‌కుడు అనే టైటిల్ ఖ‌రారు చేసారు. అతను కథగా మారితే, ‘కథానాయకుడు’..అతనే ఓ చరిత్రయితే, ‘మహానాయకుడు అంటూ సెకండ్ పార్ట్ టైటిల్ ఎనౌన్స్ చేసి రిప‌బ్లిక్ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 24న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here