Home Movie News ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆ..నంద‌మూరి హీరో న‌టిస్తున్నాడా..?

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆ..నంద‌మూరి హీరో న‌టిస్తున్నాడా..?

96
0
ntr biopic

నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ భామ విద్యాబాల‌న్ ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కంగా న‌టిస్తున్నారు. ఎ.ఎన్.ఆర్ పాత్ర‌లో సుమంత్, శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్, ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర‌లో ఆమ‌ని న‌టిస్తున్నార‌ని తెలిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి న‌టిస్తున్నారు.

ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…నంద‌మూరి హ‌రికృష్ణ పాత్ర‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించ‌నున్నాడు అంటూ గ‌తంలో వార్త‌లు వచ్చాయి. ఇదే విష‌యం గురించి నా నువ్వే ప్ర‌మోష‌న్స్ టైమ్ లో క‌ళ్యాణ్ రామ్ ని అడిగితే…ఈ పాత్ర కోసం ఎవ‌రు త‌న‌ని సంప్ర‌దించ‌లేద‌ని..ఒక‌వేళ అడిగితే చేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పారు. అయితే…ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్ టీమ్ క‌ళ్యాణ్ రామ్ ని సంప్ర‌దించగా.. క‌ళ్యాణ్ రామ్ ఓకే చెప్పార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here