Home Actor ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బాల‌య్య పాత్ర పోషించింది ఎవ‌రు..?

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బాల‌య్య పాత్ర పోషించింది ఎవ‌రు..?

87
0

నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ తెర పైకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవ‌ల హైద‌రాబాద్ లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌లో యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ…ఈ మూవీలో ఎవ‌రెవ‌రు ఏ పాత్ర పోషించారో తెలిసింది కానీ…బాల‌య్య పాత్ర‌ను ఎవ‌రు పోషించారు అనేది మాత్రం తెలియ‌లేదు అన్నారు.

అనిల్ రావిపూడి అలా మాట్లాడిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఒక‌టే ప్ర‌శ్న‌. బాల‌య్య పాత్ర‌ను పోషించింది ఎవ‌రు..?  అని. బాల‌కృష్ణ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను ఆయ‌న మ‌న‌వ‌డు చేస్తున్నాడ‌ని తెలిసింది. మ‌రి..బాల‌య్య హీరో అయ్యాక ఆ పాత్ర‌ను బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ..అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే… తాజా స‌మాచారం ప్ర‌కారం…బాల‌య్య పాత్ర‌లో బాల‌య్యే న‌టించాడ‌ట‌. అంటే…బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసార‌న్న మాట‌. మ‌రి…ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మా..?  కాదా..?  అనేది తెలియాలంటే ఎన్టీఆర్ రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here