Home Actor ఎన్టీఆర్ బ‌యోపిక్ లో మోక్ష‌జ్ఞ న‌టించాడా..?

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో మోక్ష‌జ్ఞ న‌టించాడా..?

115
0

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ మూవీ జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే..ఈ సినిమా ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు అనే వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. బాల‌య్య యంగ్ ఏజ్ లో ఉన్న‌ప్ప‌టి పాత్ర‌ను క్రిష్‌ మోక్ష‌జ్ఞ తో చేయించాల‌నుకున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్త‌ల పై బాల‌య్య కానీ, డైరెక్ట‌ర్ క్రిష్ కానీ స్పందించ‌లేదు. దీనికి కార‌ణం ఏంటంటే… ఆడియ‌న్స్ కి  స‌ర్ ఫ్రైజ్ ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌డం లేద‌ని.. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో మోక్ష‌జ్ఞ న‌టంచాడ‌ని మ‌రో వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మోక్ష‌జ్ఞ‌ను ఎన్టీఆర్ బ‌యోపిక్ ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌నుకోవ‌డం నిజ‌మో కానీ..అది జ‌ర‌గ‌లేదు అనేది కొంత మంది వాద‌న‌. అయితే…చిత్ర యూనిట్ మాత్రం మోక్ష‌జ్ఞ ఈ చిత్రంలో న‌టించాడా..?  లేదా..? అనే విష‌యం పై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో మోక్ష‌జ్ఞ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి…క్రిష్ ఈ మూవీ రిలీజ్ లోపు క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here