Home Movie News ఎన్టీఆర్ బ‌యోపిక్ లో శ్రీదేవిగా ర‌కుల్ లుక్ ఇదే..!

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో శ్రీదేవిగా ర‌కుల్ లుక్ ఇదే..!

100
0
DpHnpozXUAAjQ0n

ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో శ్రీదేవి పాత్ర ఉంటుంద‌ని…ఈ పాత్ర‌ను ర‌కుల్ ప్రీత్ సింగ్ పోషిస్తోంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఈరోజు ర‌కుల్ ప్రీత్ సింగ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా శ్రీదేవి గెట‌ప్ లో ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ స్టిల్ ను ఎన్టీఆర్ చిత్ర యూనిట్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది. ద‌క్షిణాది చిత్ర సీమలో తొలి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి, హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంది శ్రీదేవి.

ఇక ఈ చిత్రంలో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ లో బాలయ్య, రకుల్ జోడీ కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ర‌కుల్ లుక్ విష‌యానికి వ‌స్తే… శ్రీదేవిలా ఉందా..?  లేదా..?  అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే మ‌రెంత అందంగా క‌నిపిస్తోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రం పై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఎన్.బి.కె ఫిల్మ్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్ పై నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మిస్తోన్న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here