Home Movie News ఎన్టీఆర్ బ‌యోపిక్ లో హ‌రికృష్ణ లుక్ ఇదే..!

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో హ‌రికృష్ణ లుక్ ఇదే..!

96
0
DpyN5RXV4AE04Dd

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో రూపొందుతోన్న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో చంద్ర‌బాబు పాత్ర పోషిస్తోన్న రానా, అక్కినేని పాత్ర పోషిస్తున్న సుమంత్, శ్రీదేవి పాత్ర పోషిస్తోన్న ర‌కుల్ ప్రీత్ సింగ్…ఇలా ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తోన్న వారి గెట‌ప్స్ రిలీజ్ చేయ‌డం..వాటికి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం తెలిసిందే.

ఇక ఈరోజు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా హ‌రికృష్ణ పాత్ర పోషిస్తోన్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లుక్ రిలీజ్ చేసారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తోన్న బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ పాత్ర పోషిస్తోన్న క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రు ఉన్న స్టిల్ రిలీజ్ చేసారు. విజయం మీది..విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ…అంటూ హ‌రికృష్ణ చెబుతున్న‌ట్టుగా ఉన్న ఈ స్టిల్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఎన్.బి.కె ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here