Home Movie News ఎన్టీఆర్ లో అక్కినేనిగా సుమంత్ లుక్ అదిరిందిగా..!

ఎన్టీఆర్ లో అక్కినేనిగా సుమంత్ లుక్ అదిరిందిగా..!

121
0
DnguTbpX4AALGOD

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో రూపొందుతోన్న ఎన్టీఆర్ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ఒక్కో క్యారెక్ట‌ర్ ని ప‌రిచ‌యం చేస్తూ రిలీజ్ చేస్తోన్న పోస్ట‌ర్స్ ఈ సినిమా పై రోజురోజుకు అంచ‌నాల‌ను పెంచేస్తున్నాయి. ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు పాత్ర పోషిస్తోన్న ద‌గ్గుబాటి రానా క్యారెక్ట‌ర్ ను ప‌రిచ‌యం చేస్తూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఇక ఈరోజు మ‌హా న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి.

ఈ సంద‌ర్భంగా అక్కినేని పాత్ర పోషిస్తోన్న సుమంత్ క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో సుమంత్ అక్కినేనిగా న‌టిస్తున్నాడు అని తెలిసిన‌ప్ప‌టి నుంచి అక్కినేని పాత్ర‌లో సుమంత్ ఎలా ఉంటాడో అని ఆస‌క్తిగా ఎదురు చూసారు ప్రేక్ష‌కాభిమానులు. ఇక పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే..అచ్చు గుద్దిన‌ట్టుగా అక్కినేని అలా దిగిపోయారంతే. అంత‌లా క‌రెక్ట్ గా సూట్ అయ్యాడు సుమంత్. ఎన్.బి.కె ఫిల్మ్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్ పై నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here