Home Entertainment ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు కొట్లాట‌లు త‌ప్ప‌వా…వైసీపీ అంత మాట ఎందుక‌నేసింది…!

ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు కొట్లాట‌లు త‌ప్ప‌వా…వైసీపీ అంత మాట ఎందుక‌నేసింది…!

63
0

మేనెల 23 న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేసి పెట్టింది. వివిధ ద‌శ‌ల ఎన్నిక‌ల త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేప‌ట్టేందుకు రంగం సిద్దం చేసింది. అయితే ఈ కౌంటింగ్ రోజు ఏపీ లో తెలుగుదేశం, వైసీపీ, జ‌న‌సేన తో పాటు ఇతర పార్టీల అభ్య‌ర్థులు, ఏజంట్లు అందుబాటులో ఉంటారు. వీరి స‌మ‌క్షంలో కౌంటింగ్ అధికారులు…త‌మ కౌంటింగ్ డ్యూటీలు నిర్వ‌ర్తిస్తారు. అయితే కౌంటింగ్ రోజు కొట్లాట‌లు జ‌రిగే అవ‌కాశం ఉందని వైసీపీ వాదిస్తోంది.

అంతే కాదు, వైసీపీ లో టాప్ లీడ‌ర్ గా చెప్ప‌ద‌గిన రాజ్య‌స‌భ స‌భ్యుడు వి విజ‌య సాయి రెడ్డి ఈ అనుమానాన్ని బ‌య‌ట పెట్టారు. కౌంటింగ్‌ ప్రక్రియకు అధికార తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు.   కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని కోరారు.ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ)కు ఒక  లేఖ రాశారు. ఇక కౌంటింగ్‌ జరిగే వరకూ ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్‌ హాల్‌లోనే ఉండాలని, లేనిపక్షంలో రిటర్నింగ్‌ అధికారులపై అధికార పార్టీ ఏజెంట్లు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల వద్ద మెష్‌తో పాటు స్టీల్‌ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

మొత్తం మీద విజ‌య‌సాయి రెడ్డి వాద‌న‌లు వింటుంటే కౌంటింగ్ రోజున తెలుగుదేశం, వైసీపీ వ‌ర్గాలు టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క్రియేట్ చేసేలాగే ఉన్నాయి. సాధార‌ణంగా చేసే ఏర్పాట్ల‌తోనే ఓటింగ్ యంత్రాల‌తో ఓటింగ్ ను పూర్తి చేయ‌టం సాధ్యం అవుతుంది. కానీ విజ‌య‌సాయి రెడ్డి డిమాండ్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటే భారీ ఏర్పాట్లు అవ‌స‌రం. దీనికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎంత వ‌ర‌కు అంగీక‌రిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here