Home Actor ఎన్నిక‌ల సంఘం..ఏమిటి ఈ టార్చ‌ర్ – పోసాని

ఎన్నిక‌ల సంఘం..ఏమిటి ఈ టార్చ‌ర్ – పోసాని

124
0


పోసాని కృష్ణ ముర‌ళి ముఖ్య‌మంత్రి గారు..మీరు మాట ఇచ్చారు అనే సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమాని ఇంకా రిలీజ్ చేయ‌లేదు. ప్ర‌మోష‌న్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయ‌లేదు. అయితే…మోహ‌న్ రావు అనే వ్య‌క్తి ఫిర్యాదు చేయ‌డంతో  ఎన్నిక‌ల సంఘం పోసాని కృష్ణ ముర‌ళిని వివ‌ర‌ణ కోరుతూ లెట‌ర్ పంపించింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో  పోసాని కృష్ణ ముర‌ళి మాట్లాడుతూ…చంద్ర‌బాబు దొంగ అని తెలుసు క‌దా..మ‌ళ్లీ అత‌ను దొంగ అని ఎందుకు సినిమా తీస్తాను. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 34 ఏళ్లు.  సెన్సార్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ఈ సినిమాను తీసాను. ఏ క్లిప్పింగ్ టీవీలో వేయ‌లేదు. మీడియాకి కూడా అస‌లు ఈ సినిమా గురించి చెప్ప‌లేదు. ఎవ‌రో మోహ‌న్ రావు ఫిర్యాదు చేసార‌ట‌. అస‌లు ఆయ‌న‌కి ఈ సినిమా గురించి ఎలా తెలిసింది అని ప్ర‌శ్నించారు.

కామ‌న్ మేన్ కి ఈ సినిమా గురించి ఎలా తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయితే…అందులో అభ్యంత‌రం స‌న్నివేశాలు ఉంటే అప్పుడు క‌దా ఫిర్యాదు చేసేది. మ‌రి..ఏమీ తెలియ‌కుండా ఎలా ఫిర్యాదు చేస్తారు..? ఎన్నిక‌ల క‌మీష‌న్ అంటే చాలా గొప్ప‌ది అని న‌మ్ముతున్నాను. అలాగే అది ప్ర‌జాస్వామ్యానికి చాలా విలువు తెచ్చిపెడుతుంది నమ్ముతున్నాను. కానీ..ఇలాంటి ప‌నులు చేస్తుంటే బాధేస్తుంది. ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ మీద గౌర‌వంతో వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మెయిల్ ఇచ్చాను. అలాగే రిజిష్ట‌ర్ పోస్ట్ కూడా చేసాను. చ‌దువుకున్నారు రిప్లై ఇచ్చారు. ఏమ‌ని రిప్లై ఇచ్చారంటే…మీరు స్వ‌యంగా రావాలంటూ రిప్లై ఇచ్చారు.

పోసాని తెలుసు క‌దా..స్వ‌యంగా ఫోన్ లో కూడా మాట్లాడాను. అయినా  ర‌మ్మ‌న‌డం ఏంటి..?  ఏమిటి ఈ టార్చ‌ర్ అని ప్ర‌శ్నిస్తున్నాను. మీ దగ్గ‌ర ఏదైనా ఫ్రూఫ్ ఉంటే పిల‌వండి. ఉందా..? ఇదిగో ఫ్రూఫ్ ఉంది ఈ క్లిపింగ్స్ మా దగ్గ‌ర ఉన్నాయి అని చెప్పండి. త‌ప్ప‌కుండా వ‌స్తాను.  ఎన్నిక‌ల క‌మీష‌న్ ఇలా చేయ‌డం వ‌ల‌న చంద్ర‌బాబుకి అనుకూలంగా మారిందా..? అని అనుకుంటారు. అలా అనుకునే ఆస్కారం ఇవ్వ‌ద్దు మీరు. సెన్సార్ బోర్డ్ ఇలా పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తించ‌దు. నేను స‌మాజానికి వ్య‌తిరేకంగా ఈ సినిమా తీయ‌లేదు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీయ‌లేదు. ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా తీయ‌లేదు అని పోసాని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here