Home Political News ఎన్నిక‌ల స‌మ‌యంలో మా బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగిస్తాం – బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్

ఎన్నిక‌ల స‌మ‌యంలో మా బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగిస్తాం – బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్

143
0

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప‌ర్య‌ట‌న పై కాంగ్ర‌స్ నాయ‌కులు మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్  స్పందిస్తూ… ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. ఎక్కడ ఎన్నికలు  జరిగినా అమిత్‌ షా కంటే మందు ఏసీబీ, ఈడీ అధికారులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-టీఆర్‌ఎస్‌లు కావాలనే కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఫైర్ అయ్యారు. 119 స్థానాలలో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులే లేరని, అందుకే టికెట్లు రాని వేరే పార్టీలలోని సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్ కామెంట్స్ కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కౌంట‌ర్ ఇస్తూ…అమిత్ షా ప‌ర్య‌ట‌న‌తో టీఆర్ఎస్, కాంగ్రెస్ కి చెమ‌ట‌లు ప‌ట్టాయి అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మా బ్ర‌హ్మాస్త్రం మోడీని ప్ర‌యోగిస్తాం. టీఆర్ఎస్ తాటాకు చ‌ప్పుళ్ల‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డ‌రు. తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుందని స్ప‌ష్టం చేసారు.  119 స్ధానాల్లో గెలుపు గుర్రాల‌ను బ‌రిలోకి దింపుతాం. టీఆర్ఎస్ – ఎంఐఎం పొత్తును మ‌హాకూట‌మిని ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తారు అని చెప్పారు.  బీజేపీకి భ‌య‌ప‌డి దిక్కులేని ప‌రిస్ధితుల్లో కూట‌ములుగా ఏర్ప‌డుతున్నారు. దేశంలో కాంగ్రెస్ దీన ప‌రిస్థితుల్లో ఉందని.. బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాలు భ‌య‌ప‌డుతున్నాయ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here