Home Actor ఎఫ్ 2 డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

ఎఫ్ 2 డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

83
0

ప‌టాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి..తాజాగా వెంకీ – వ‌రుణ్ కాంబినేష‌న్ లో రూపొందించిన‌ ఎఫ్ 2 సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్నారు యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఎఫ్ 2 అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతూ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. దీంతో వ‌రుస‌గా నాలుగు హిట్స్ సాధించిన అనిల్ రావిపూడికి డిమాండ్ పెరిగింది.

దీంతో అనిల్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే…సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి ఈ స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇటీవ‌ల ఓ క‌థ చెప్పాడ‌ట‌. క‌థ బాగుంది..ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ్ అని మ‌హేష్ బాబు చెప్పాడు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం అనిల్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లో మ‌హేష్ కి అనిల్ ఫుల్ స్టోరీ చెప్ప‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హేష్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్..సుకుమార్ తో సినిమా చేయ‌నున్నాడు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. సుకుమార్ సినిమా త‌ర్వాత మ‌హేష్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డితో సినిమా చేయాలి. ఈలోపు మ‌హేష్ ని అనిల్ ఫుల్ స్రిప్ట్ తో మెప్పిస్తే.. సుకుమార్ సినిమా పూర్తైన త‌ర్వాత అనిల్ రావిపూడితో చేస్తాడో..?  లేక‌ స‌ందీప్ రెడ్డితో చేస్తాడో..?  తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here