Home Political News ఎమ్మెల్యే ఈశ్వ‌ర‌మ్మ‌కు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టుల లేఖ‌.

ఎమ్మెల్యే ఈశ్వ‌ర‌మ్మ‌కు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టుల లేఖ‌.

93
0

మావోయిస్టులు అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, సోముల‌ను హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. అయితే…వీళ్లిద్ద‌రిని ఎందుకు హ‌త్య చేయాల్సి వ‌చ్చిందో చెబుతూ మావోయిస్టులు లేఖ రాసారు. అంతే కాకుండా…ఈ లేఖలో ఎమ్మెల్యే ఈశ్వ‌ర‌మ్మకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

 ఈనాడు, సాక్షి, ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యానికి మ‌రియు ఎడిట‌ర్ గార్ల‌కు విప్ల‌వాభివంద‌న‌ముల‌తో మావోయిస్టు పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ నుంచి వ్రాయుట… గిరిజన వ్య‌తిరేకులు, ప్ర‌జా ద్రోహులు అయిన కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావును, సోముల‌ను ఆదివారం అన‌గా 23.09.18న ప్ర‌జా కోర్టులో వారు చేసిన తప్పుల‌కు గాను శిక్షించ‌డం జ‌రిగిన‌ది. క్వారీ విష‌యంలో ఎన్నో సార్లు హెచ్చ‌రించినను అధికార పార్టీకి తొత్తులుగా మారి మా హెచ్చ‌రిక‌ల‌ను లెక్క చేయ‌కుండుట‌మే కాకుండా బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు గాను లోలోప‌ల ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించ‌డం వ‌ల‌న ప్ర‌జా కోర్టులో శిక్ష‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగిన‌ది. అదే విధంగా గిరిజ‌నుల‌ను మోసం చేసి స్వ‌లాభం కోసం కోట్ల‌కు అమ్ముడుపోయిన ప్ర‌జాద్రోహి కిడారికి అదే విధంగా

ఎన్నో త‌ప్పులు చేసిన వారిని క‌ఠినంగా శిక్షించ‌డం జ‌రిగిన‌ది. ప్ర‌జ‌ల స‌మ‌క్షంలోనే వారు చేసిన తప్పుల‌ను ఒప్పుకోవ‌డం జ‌రిగిన‌ది. అందుకే శిక్ష‌ల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగిన‌ది.

 పోలీస్ వారికి – గ‌త ఆదివారం మీ తోటి ఉద్యోగ సోద‌రులు మాకు ఆయుధ‌ముల‌తో చిక్కిన‌ను వారిని చంప‌లేదు. పొట్ట‌కూటి కోసం ఉద్యోగం చేయుచున్న మీ స‌హోద్యోగుల‌ను పెద్ద మ‌న‌స్సుతో క్ష‌మించి విడిచి పెట్ట‌డం జ‌రిగిన‌ది. అదే మా విప్ల‌వ సోద‌రులు మీకు దొరికిన యెడ‌ల మీరు దొంగ క‌థ‌లు అల్లి వాళ్ల‌ని నిస్స‌హాయుల‌ను చేసి ఎన్ కౌంట‌ర్ చేస్తారు క‌దా. మ‌రి మీరు మాలాగ చేయ‌గ‌ల‌రా ఆలోచించండి.

 గిడ్డి ఈశ్వ‌ర‌మ్మా – ప్ర‌జాద్రోహి, గిరిజ‌న ద్రోహి, అధికార పార్టీకి తొత్తు అయిన నీవు మ‌మ్ముల‌ను విమ‌ర్శించ‌డ‌మా…20 కోట్ల‌కు అధికార పార్టీకి అమ్ముడుపోయిన నీవు మాకు నీతులు చెప్ప‌డ‌మా..?   కిడారి ప్ర‌జా కోర్టులో నీ విష‌యం కూడా నిజం చెప్ప‌డం జ‌రిగిన‌ది. నీకు అందిన ఆ అవినీతి సొమ్మును 2 నెల‌లో గిరిజ‌న ప్ర‌జ‌లంద‌రికి పంచి క్ష‌మాప‌ణ చెప్పాలి. బాక్సైట్ త్ర‌వ్వ‌కాల‌ను కూడా వ్య‌తిరేకించాలి. లేదంటే నీకు కూడా కిడారి, సోముల‌కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంది. మేము చెప్పిన‌ట్టు చేస్తావు క‌దా..లేదా మ‌రి ఈ స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వి దొరుకుతుంద‌ని ఆశిస్తావా..?  ఆలోచించుకో..! 

 ఇట్లు

విప్ల‌వాభివంద‌న‌ముల‌తో

మావోయిస్టు

సెంట్ర‌ల్ క‌మిటీ   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here