Home Actor ఎవ‌రినీ వ‌ద‌లం..రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాం – ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత వార్నింగ్..!

ఎవ‌రినీ వ‌ద‌లం..రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాం – ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత వార్నింగ్..!

166
0

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన వివాద‌స్ప‌ద చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో మే 1న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఈ మూవీ ప్రెస్ మీట్ పెట్టాల‌నుకోవ‌డం..పోలీసులు అడ్డుకోవ‌డం తెలిసిందే. ఈ రోజు హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి వెళ్లిన తమను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని తమను అడ్డుకున్నారని, దీని వెనుకున్న ముఖ్య నాయకులందరినీ బయటికి తీసుకొస్తామని, తప్పకుండా పోరాటం చేస్తామని అన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కొన్ని రోజులే వాళ్లు. ఇప్పటికే తెలంగాణలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆంధ్రలో ప్రజలు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. దీని పరిణామాలు మే 23వ తేదీన ఎదుర్కొంటారు అని టీడీపీ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రాకేష్ రెడ్డి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here