Home Actor ఎవ‌రు మ‌రో క్ష‌ణం అవుతుందా..?

ఎవ‌రు మ‌రో క్ష‌ణం అవుతుందా..?

22
0
ఎవ‌రు మ‌రో క్ష‌ణం అవుతుందా..? spiceandhra

అడివి శేష్, న‌వీన్ చంద్ర‌, రెజీనా ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన థ్రిల్ల‌ర్ ఎవ‌రు. ఈ చిత్రానికి వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీవీపీ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీని ఈ నెల 15న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చిచంపడంతో సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే.. నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా ? లేక దీని వెనుక మరో కుట్ర ఉందా ? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్) కు అప్పగిస్తారు.

ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్ తో సినిమా కొనసాగుతుంది అనేది ట్రైల‌ర్ ను బ‌ట్టి తెలుస్తుంది. అడివి శేష్, రెజీనా, న‌వీన్ చంద్ర‌.. ఈ ముగ్గురి మ‌ధ్య న‌డిచే ఈ క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. క్ష‌ణం సినిమా వ‌లే పెద్ద విజ‌యం సాధిస్తుంద‌నే అంచ‌నాల‌ను ఏర్ప‌రిచింది. మ‌రి… ఎవ‌రు ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here