Home Actor ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రాన్ని అభినందించిన రాఘ‌వేంద్ర‌రావు

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రాన్ని అభినందించిన రాఘ‌వేంద్ర‌రావు

87
0
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రాన్ని అభినందించిన రాఘ‌వేంద్ర‌రావు spiceandhra

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గ‌త శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద విడుద‌లైన న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్ `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`. న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ హీరో హ‌రోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి స్వ‌రూమ్ ద‌ర్శ‌కుడు.  ప్రేక్షకులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటోంది. ఈ చిత్రం.

 రీసెంట్‌గా ఈ సినిమాను చూసిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు, హీరో న‌వీన్ పొలిశెట్టి, నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా, ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు ప‌ర్స‌న‌ల్‌గా ఫోన్ చేసి అద్భుత‌మైన సినిమా తీసారంటూ అభినందించారు. సినిమాకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను యూనిట్‌తో ద‌ర్శ‌కేంద్రుడు ముచ్చ‌టించారు. ఔట్‌స్టాండింగ్ మూవీ తీశార‌ని యూనిట్‌ను ప్ర‌శంసించారు. అంతే కాకుండా..ఈ సినిమా చాలా బాగుంది. సినిమా చూడ‌ని వాళ్లు ఉంటే త‌ప్ప‌కుండా చూడండి అని చెప్పారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here