Home Political News ఏపీలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన చంద్ర‌బాబు.!

ఏపీలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన చంద్ర‌బాబు.!

110
0
Chandrababu-Naidu

ఏపీలో నిరుద్యోగుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శుభ‌వార్త చెప్పారు. వివిధ శాఖ‌ల్లో 20,000 వేల‌కు పైగా పోస్టుల భ‌ర్తీకి చంద్ర‌బాబు ఆమోదం తెలియ‌చేసారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరుగనుంది. వివిధ శాఖలలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్  ఇచ్చారు.

నియామ‌కాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ్రూప్-1 : 150 ఖాళీలు, గ్రూప్-2 : 250  ఖాళీలు, గ్రూప్-3 : 1,670  ఖాళీలు, డీఎస్సీ ద్వారా : 9,275  ఖాళీలు, పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ : 3,000 ఖాళీలు, వైద్య శాఖల్లో : 1,604  ఖాళీలు, ఇతర శాఖల్లో : 1,636 ఖాళీలు. ఈ నియామ‌కాల‌కు సంబంధించిన ప‌రీక్ష‌ల, ఫ‌లితాల…త‌దిత‌ర వివ‌రాల‌తో కూడిన ప్ర‌క‌ట‌న‌ను త్వ‌ర‌లోనే ఏపీ ప్ర‌భుత్వం రిలీజ్ చేయ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here