Home Actor ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఆప‌డం అనేది ఎన్టీఆర్ కు మ‌రోసారి వెన్నుపోటు లాంటిది –...

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఆప‌డం అనేది ఎన్టీఆర్ కు మ‌రోసారి వెన్నుపోటు లాంటిది – రామ్ గోపాల్ వ‌ర్మ‌

88
0


ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన కీల‌క ఘ‌ట్టాలను క‌థా వ‌స్తువుగా తీసుకుని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని ఈరోజు రిలీజ్ చేసారు. అయితే…ఏపీలో ఈ సినిమాను వచ్చే నెల 3 వరకూ స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏపీలో తప్ప ప్రపంచమంతటా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యింది. ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుద‌ల‌కు హైకోర్టు స్టే ఇచ్చిన నేేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనే ఇంట్ర‌స్ట్ తో ఈ సినిమాని తీయ‌డం జ‌రిగింది.

సుప్రీంకోర్ట్… ప‌ద్మావ‌త్, ఉడ‌తా పంజాబ్ సినిమా లు వివాద‌స్ప‌దం అయిన‌ప్పుడు చాలా క్లియ‌ర్ గా చెప్పింది ఏంటంటే…ఒక సినిమాకి సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చిన త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోను ఆ సినిమాను ఆప‌డానికి వీళ్లేదు అని రెగ్యులేష‌న్స్ జారీ చేసింది. అందుక‌నే తెలంగాణ హైకోర్టుకి ఈ సినిమాని ఆపాల‌ని కొంత మంది ఫిర్యాదు చేసిన‌ప్పుడు వెంట‌నే కొట్టేయ‌డం జ‌రిగింది. అయితే.. ఏపీలో ఈ సినిమా విడుద‌ల‌ను ఆపేస్తార‌ని ఊహించ‌లేదు. ఇలా జ‌రిగిన దానికి అస‌లు దీని వెన‌క ఎవ‌రు ఉన్నారో అంద‌రికీ తెలుసు. పేర్లు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పేర్లు చెప్పే ధైర్యం లేక కాదు. ప్ర‌స్తుతం ఇది కోర్టు ప‌రిథిలో ఉంది కాబ‌ట్టి చెప్ప‌డం లేదు. కానీ…నేను చెప్పినా చెప్ప‌క‌పోయినా ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు.

ఈరోజు రిలీజైన అన్ని థియేట‌ర్స్ లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ హౌస్ ఫుల్ అవ్వ‌డం బ‌ట్టి ప్ర‌జ‌ల‌కు ఈ సినిమా చూడాల‌నే కోరిక ఎంత బ‌లంగా ఉందో అర్ధం అవుతుంది. ఒక సినిమాని ఒక స్టేట్ లో రిలీజ్ చేసి..మ‌రో స్టేట్ లో రిలీజ్ కాక‌పోవ‌డం అనేది ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి మా వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. ఈ సినిమాని ఆప‌డం అనేది ఎన్టీఆర్ కి మ‌రోసారి వెన్న‌పోటు పొడ‌వం లాంటిది. 100% న్యాయం మాకు దక్కుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here