Home Actor ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు లైన్ క్లియ‌ర్..!

ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు లైన్ క్లియ‌ర్..!

127
0

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన వివాద‌స్ప‌ద చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను కోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ‌లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని చాలా కాలం త‌ర్వాత వ‌ర్మ‌కు విజ‌యాన్ని అందించింది. అయితే…ఏపీలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు వ‌ర్మ సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లి ఫైట్ చేసారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఏపీలో మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న ఆంధ్రప్రదేశ్ లో విడుదల కానుంది. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను వచ్చి చూడండి అంటూ వర్మ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.యన్.టి.ఆర్… అనుభవించిన నరకం’ అంటూ పోస్ట్ చేసిన పోస్టర్ పై ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు పాత్రధారులు ఉన్నారు. మ‌రి..ఏపీలో ఈ సినిమాకి ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భించ‌నుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here