Home Actor ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా..? లేదా..?

ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా..? లేదా..?

75
0

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన వివాద‌స్ప‌ద చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం తెలంగాణ‌లో రిలీజ్ అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విడుద‌ల ఆపాలంటూ హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వ‌డం తెలిసిందే. ఆత‌ర్వాత హైకోర్ట్ సినిమా విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ సినిమాని మే 1న ఏపీలో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి, ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎనౌన్స్ చేసారు.

వ‌ర్మ విజ‌య‌వాడ వెళ్లి సినిమా ప్రెస్ మీట్ పెట్టాల‌నుకోవ‌డం..పోలీసులు అడ్డుకోవ‌డం తెలిసిందే. ఓ ప‌క్క వీళ్లు సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ చేస్తుంటే…మ‌రో వైపు ఈ చిత్ర విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని..అందుచేత సినిమాని విడుద‌ల చేయ‌రాద‌ని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బయోపిక్ లపై రాజకీయ పార్టీలు తెలిపిన అభ్యంతరం మేరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాల విడుదల పై ఈసీ ఆంక్షలు విధించింది. మ‌రి…వ‌ర్మ ఎలా స్పందిస్తారో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here