Home Actor ఏపీలో విన‌య విధేయ రామ స్పెష‌ల్ షోల‌కి అనుమ‌తి..!

ఏపీలో విన‌య విధేయ రామ స్పెష‌ల్ షోల‌కి అనుమ‌తి..!

97
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ – మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్ లో రూపొందిన భారీ చిత్రం వినయ విధేయ రామ. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వాని న‌టించింది.  డి.వి.వి. దాన‌య్య నిర్మించిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సంక్రాంతి కానుక‌గా ఈ నెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే… జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఈ సినిమా స్పెషల్ షోలు వేసుకునేందుకు గాను ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది.

ఈ పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా మరో షో వేయబడుతుంది. ఇలా అదనపు షోలకి అనుమతి లభించడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వుంది. చ‌ర‌ణ్ కి మాస్ లో క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. దీనికి తోడు ఈ మాస్ హీరోతో ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి సినిమా తీయ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా తప్పకుండా చరణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి…ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here