Home Actor ఏబీసీడీ రివ్యూ..!

ఏబీసీడీ రివ్యూ..!

93
0

గౌర‌వం, కొత్త జంట‌, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, ఒక్క క్ష‌ణం…చిత్రాల త‌ర్వాత అల్లు శిరీష్ న‌టించిన చిత్రం ఏబీసీడీ. అమెరిక‌న్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశీ అనేది ట్యాగ్ లైన్. అల్లు శిరీష్‌, రుక్స‌ర్ థిల్లాన్‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ రోజు (మే 17) ఏబీసీడీ చిత్రం రిలీజైంది. మ‌రి…ఏబీసీడీ అల్లు శిరీష్ కి విజ‌యాన్ని అందించిందా..?  లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

– అర‌వింద్ (అల్లు శిరీష్) అమెరికాలో పుట్టి పెరిగాడు. తండ్రి (నాగ‌బాబు) మిలియ‌నీర్ కావ‌డంతో అర‌వింద్ డ‌బ్బును మంచి నీళ్లులా ఖ‌ర్చు చేస్తుంటాడు. కావాల్సినంత డ‌బ్బు ఉంది కానీ..ఆ డ‌బ్బు విలువ మాత్రం తెలియ‌దు. దీంతో అర‌వింద్ తండ్రి కొడుకుకి డ‌బ్బు విలువ తెలియాలి అని చెప్పి ప్లాన్ చేసి అర‌వింద్ ని ఇండియాకి పంపిస్తాడు. అత‌నితో పాటు ఫ్రెండ్ బాల షణ్ముగం అలియాస్ భాషా(భ‌ర‌త్‌) కూడా ఇండియా వ‌స్తాడు. ఇండియాకి వ‌చ్చిన త‌ర్వాత అర‌వింద్ కి ఇదంతా వాళ్ల ఫాద‌ర్ ప్లాన్ అని తెలుసుకుంటాడు.

అర‌వింద్ కి నెల‌కి ఐదు వేలు రూపాయ‌లు మాత్ర‌మే పంపిస్తుంటాడు. రోజుకు 83 రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేస్తూ..ఆ ఐదు వేల‌ను చాలా పొదుపుగా వాడుకుంటుంటాడు. అర‌వింద్, భాషా ఇద్ద‌రినీ ఎంబిఏ కాలేజీలో జాయిన్ చేస్తారు. అక్క‌డ నేహ (రుక్స‌ర్ థిల్లాన్) ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త పెరుగుతుంది..ప్రేమ‌గా మారుతుంది. అర‌వింద్ ధ‌న‌వంతుడు అయిన‌ప్ప‌టికీ రోజుకు 83 రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేస్తుంటాడు అనే విష‌యాన్ని నేహ ద్వారా మీడియాకి తెలియ‌డం అర‌వింద్ బాగా పాపుల‌ర్ అవుతాడు.

 ఇదిలా ఉంటే..ఫైనాన్స్ మినిష్ట‌ర్ (శుభ‌లేక సుధాక‌ర్) త‌న కొడుకు భార్గ‌వ్ (రాజా)  రాజకీయాల్లో రాణించాలి అనుకుంటాడు. పార్టీ ఆదేశాలు మేర‌కు ఇష్టం లేక‌పోయినా భార్గ‌వ్ ప్ర‌జ‌ల్లో మంచి పేరు సంపాదించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. ఇలాంటి టైమ్ లో అర‌వింద్, భార్గ‌వ్ మ‌ధ్య పోటీ ఏర్ప‌డుతుంది. ఇంత‌కీ పోటీ ఏంటి..? అర‌వింద్ నేహ ల‌వ్ స్టోరీ ఏమైంది..? అర‌వింద్ డ‌బ్బు విలువ‌ను ఎలా తెలుసుకున్నాడు అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేష – మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన ఏబీసీడీ చిత్రాన్నితెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసారు. అల్లు శిరీష్ కెరీర్ లో మంచి విజ‌యం సాధించాల‌ని ఈ సినిమాని ఎంచుకున్నాడు. పాత్ర ప‌రిధి మేర‌కు బాగానే న‌టించాడు. ఇక హీరోయిన్ రుక్స‌ర్ థిల్లాన్ పాత్ర అప్పుడ‌ప్పుడు వ‌చ్చి వెళుతుందే కానీ…ఈ పాత్ర‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నిపిస్తుంది. హీరో, హీరోయిన్ మ‌ధ్య చెప్పుకోద‌గ్గ స‌న్నివేశాలు లేవు. శిరీష్ ఫ్రెండ్ గా న‌టించిన భ‌ర‌త్ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసాడు కానీ..న‌వ్వించ‌లేక‌పోయాడు. వెన్నెల కిషోర్ కాఫీ విత్ కిషోర్ పొగ్రామ్ తో అప్పుడప్పుడు న‌వ్వించాడు.

డైరెక్ట‌ర్ సంజీవ్ రెడ్డి మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో ఎలా తీస్తే…బాగుంటుంది అనే విష‌యం పై క్లారిటీ లేద‌నిపిస్తుంది. అందుక‌నే ఈ సినిమాని తీయ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. జుదా సాందీ సంగీతం బాగుంది. ముఖ్యంగా మెల్ల‌మెల్ల‌గా సాంగ్ ఆక‌ట్టుకుంది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ కి వ‌చ్చేస‌రికి ఇంకా బోరింగ్ గా అనిపిస్తుంటుంది. టోట‌ల్ గా ఒక్క‌మాట‌లో చెప్పాలంటే…ఏబీసీడీ ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది..!

రేటింగ్ – 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here