Home Actor ఏ వ‌య‌సులో అయినా రొమాన్స్ చేయ‌చ్చు అని చెప్పే సినిమా మ‌న్మ‌థుడు 2 – నాగార్జున‌

ఏ వ‌య‌సులో అయినా రొమాన్స్ చేయ‌చ్చు అని చెప్పే సినిమా మ‌న్మ‌థుడు 2 – నాగార్జున‌

21
0
ఏ వ‌య‌సులో అయినా రొమాన్స్ చేయ‌చ్చు అని చెప్పే సినిమా మ‌న్మ‌థుడు 2 - నాగార్జున‌ spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా చి.ల‌.సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం మ‌న్మ‌థుడు 2. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా మ‌న్మ‌థుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఎన్. క‌న్వెన్ష‌న్ లో సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ… నాకు చాలా ఇష్ట‌మైన నెల ఈ ఆగ‌ష్టు నెల‌. మొన్న‌నే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. 9 వ తారీఖు మ‌న్మ‌థుడు 2 రిలీజ్ అవుతుంది. ఈ నెలాఖ‌రుకు నాకు 30 ఏళ్లు నిండుతాయి. ఈ సినిమాకి మ‌న్మ‌థుడు అని మ‌ళ్లీ ఎందుకు పేరు పెట్టామంటే… ఒరిజిన‌ల్ మ‌న్మ‌థుడు హి హేట్స్ విమన్. ఈ మ‌న్మ‌థుడు హి ల‌వ్స్ విమ‌న్. అందుక‌నే ఈ టైటిల్ పెట్టాం.

నాకు వ‌య‌సు గురించి మాట్లాడ‌డం పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. దీనిని ప‌క్క‌న పెట్టాస్తా. ఇప్పుడు నేను ఒక ల‌వ్ స్టోరీ చేయ‌డం ఏంటి అని చాలా మంది అడిగారు. ఒక సంవ‌త్స‌రం క్రితం ఈ సినిమా చూపించారు. ఇది ఒక ఫ్రెంచ్ పిల్మ్. నా వ‌య‌సుకు త‌గ్గా సినిమా. నాకు బాగా సూట్ అవుతుంది. ఏ వ‌య‌సులో అయినా ప్రేమించొచ్చు. ఏ వ‌య‌సులో అయినా రొమాన్స్ చేయ‌చ్చు అని చెప్పే సినిమా ఇది.

ఏ వ‌య‌సులో అయినా ముద్దు పెట్టుకోవ‌చ్చు. నాకు ఎంతో ఇష్ట‌మైన సినిమా. అంద‌రికీ ఇష్ట‌మైన సినిమా మ‌న్మ‌థుడు. ఆ సినిమా అస‌లైన సృష్టిక‌ర్త విజ‌య్ భాస్క‌ర్ గారు. మ‌న్మ‌థుడులో అన్ని పంచ్ లు ఉన్నాయంటే కార‌ణం ఆయ‌నే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ర‌మ్మ‌ని పిలిచాను. ఈ ఫంక్ష‌న్ కి రావాలి అంటే.. చాలా థ్యాంక్స్ అండి వ‌స్తున్నాను త‌ప్ప‌కుండా అని చెప్పి మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్ చాలా వేడి వేడిగా ఉంద‌న్నారు. ఆయ‌న ఈ ఫంక్ష‌న్ కి వ‌చ్చినంద‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అనేది మా టీమ్ అంద‌రి న‌మ్మ‌కం అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here