స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే.. ఈ రెండింటిలో ఏ సినిమా ముందుగా స్టార్ట్ అవుతుందో అనేది సస్పెన్స్ గా ఉండేది.
ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం..వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందే ఐకాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే… బన్నీ సరసన నటించేందుకు రాశీఖన్నాను సెలెక్ట్ చేసారని తెలిసింది. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ & గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ భారీ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.