Home News ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. రాజ‌మండ్రిని మ‌రింత‌గా అభివృద్ధి చేస్తాను – జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌..!

ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. రాజ‌మండ్రిని మ‌రింత‌గా అభివృద్ధి చేస్తాను – జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌..!

86
0


రాజ‌మండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున అత్తి స‌త్య‌నారాయ‌ణ పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌ జ‌న సైనికులు, కార్య‌క‌ర్త‌లతో క‌లిసి ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేస్తూ దూసుకెళుతున్నారు. ఈ సంద‌ర్భంగా అత్తి స‌త్య‌నారాయ‌ణ ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ…రాజ‌మండ్రి అసెంబ్లీ స్ధానానికి పోటీ చేస్తున్న అభ్య‌ర్ధుల్లో ఒక వ్య‌క్తి ఇప్ప‌టికే ఎమ్మెల్యేగా చేసిన వ్య‌క్తి. ఆయ‌న ఏం సేవ చేసారో రాజ‌మండ్రి ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. అలాగే మ‌రో అభ్య‌ర్ధి కూడా రాజ‌కీయ హోదా పొందిన వ్య‌క్తే. ఈయ‌న‌ కూడా ప్ర‌జ‌ల‌కు ఏవిధంగా సేవ చేసారో తెలుసు.

గ‌వ‌ర్న‌మెంట్ కొన్ని ప‌థ‌కాలు ఇస్త‌ది. వాటిని అర్హులైన వారికి కూడా అధికార ప‌క్షం నాయ‌కులు వారి సొంత మ‌నుషుల‌కే వ‌చ్చేలా చేస్తున్నారు.  అంతే కాకుండా ఒక్కొక్క‌రికి రెండేసి ఇల్లు, మూడేసి ఇల్లులు..ఇచ్చారు. ఇలా చేయ‌డం వ‌ల‌నే  రాజ‌కీయ వ్య‌వ‌స్థ కుళ్లిపోయింది. ఈ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌తి ఒక్క‌రు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. మేము కానీ అధికారంలోకి వ‌స్తే…మ‌ధ్య‌వ‌ర్తులు కానీ..ద‌ళారులు కానీ..ఎవ‌రూ ఉండ‌రు. డైరెక్ట్ గా మ‌మ్మ‌ల్ని క‌ల‌వ‌చ్చు. ఏ స‌మ‌స్య‌లు ఉన్నా ప‌రిష్క‌రిస్తాం.

 గోదారి వాసుల‌మే కానీ..గోదారి వాట‌ర్ ను 24 గంట‌లు స‌ప్లై చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నాం. పేప‌ర్ మిల్లు నుంచి వ‌చ్చే క‌లుషిత‌మైన వాట‌రు, డ్రైనేజీ నుంచి వ‌చ్చే క‌లుషిత‌మైన వాట‌రు గోదారిలో కలిసిపోతున్నాయి. అందువ‌ల‌న వాట‌ర్ క‌లుషిత‌మై చాలా మంది అనారోగ్యం పాల‌వుతున్నారు. అందుచేత‌ ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా క‌లుషిత‌మైన వాట‌ర్ ను స‌ముద్రంలోకి మ‌ళ్లించి వాట‌ర్ క‌లుషితం కాకుండా చేస్తాన‌ని మాట ఇస్తున్నాను.

 అలాగే రాజ‌మండ్రిలో ట్రాఫిక్ స‌మ‌స్య ఉంది. ప్లైఓవ‌ర్స్ కు శంకుస్ధాప‌న చేసారు కానీ…ప‌నులు ప్రారంభించ‌లేదు. మేము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫ్లైవ‌ర్స్ వ‌ర్క్ ను స్పీడుగా చేసి ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాను.  రాజ‌మండ్రి చుట్టు పక్క‌ల 500 గ్రామాలు ఉన్నాయి. స‌రైన వైద్య స‌దుపాయం ఉండ‌డం లేదు. అత్య‌వ‌స‌రం ప‌రిస్థితి వ‌స్తే..కాకినాడ వెళ్లాల్సి వ‌స్తుంది. అటువంటి ప్రాబ్ల‌మ్ లేకుండా మెరుగైన వైద్య  స‌దుపాయం అందేలా చేస్తాన‌న్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here